ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ఇటీవల మొదటిగా ఎమ్మెల్సీగా ఎన్నికై ..మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెల్సిందే .ఇలా ప్రత్యేక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నారా లోకేష్ నాయుడు మీద ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తోన్న సంగతి తెల్సిందే .
అయితే ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను తిప్పికొట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు అని సమాచారం .దానిలో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నారా లోకేష్ నాయుడును ప్రత్యేక్ష ఎన్నికల్లో బరిలోకి దింపాలని చూస్తున్నట్లు సమాచారం .ప్రస్తుతం ప్రముఖ సినిమా నటుడు స్టార్ హీరో ,స్వయానా వియంకుడు హిందుపూరం అసెంబ్లీ నియోజక టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ను తప్పించి ఆ స్థానం నుండి నారా లోకేష్ నాయుడును బరిలోకి దించాలని బాబు ఆలోచిస్తున్నారు అని సమాచారం .ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అక్కడ నుండి అయితేనే లోకేష్ గెలుస్తాడు అని భావించిన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలుగు తమ్ముళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు .చూడాలి మరి బాలయ్య ఏ నిర్ణయం తీసుకుంటారో ..?