Home / MOVIES / లక్ష్మీస్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించే సినిమా.. నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటర్వ్యూ..!

లక్ష్మీస్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించే సినిమా.. నిర్మాత రాకేష్ రెడ్డి ఇంటర్వ్యూ..!

లక్ష్మీస్ ఎన్టీఆర్’ అనే టైటిల్‌ను పెట్టి రామారావు జీవిత చరిత్రపై సినిమా తీయబోతున్నానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరతీసిన విషయం తెలిసిందే. అయితే వర్మను చాలా మంది వైయస్సార్సిపి కి ,లక్ష్మి’S ఎన్టీఆర్ కి ఏ విధమైన సంబంధం వుంది అని అడుగుతున్నారు ..దానికి వర్మ సమాధానంగా నిర్మాత రాకేశ్ రెడ్డి ఒక పేపర్ కిచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ పోస్ట్ చేశాడు

 

1).లక్ష్మీ’స్ యన్.టి.ఆర్ సినిమాకు మీరు నిర్మాతగా ఉన్న౦దుకు ఎలా ఫీల్ అవుతున్నారు?


చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను..ఎందుకంటే జరిగిన నిజాలని చెప్పటానికి రాంగోపాల్ వర్మ గారు ఎంచుకున్న స్క్రీన్ ప్లే తీరు నాకు చాల నచ్చి౦ది*

 

2).మీకు రామ్ గోపాల్ వర్మ కు ఎప్పటి ను౦చి పరిచయం ఉ౦ది?

 

కొన్ని నెలల కి౦దటే ఒక కామన్ ప్రె౦డ్ ద్వారా కలిసాను

 

3).మీరు ఇంతకుముందు ఏదైనా సినిమాలు నిర్మించారా?
లేక ఇదే మొదటి సినిమానా?

ఇదే నా మొదటి సినిమా..కానీ దీనిని నేను సినిమాలా చూడట్లేదు..జరిగిన నిజాలకి ఈ చిత్రం ఒక అద్దం లా౦టిదని నా అభిప్రాయం

 

4).YSR కాంగ్రెస్ పార్టీకి చె౦దిన రాకేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీకు చెందిన మహనీయుడు NTR గారి జీవిత చరిత్ర సినిమా తీయడానికి గల కారణం ఏమి?

 

రాజకీయాలకి అతీతంగా కేవలం నిజనిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉ౦దని నేను స్ట్రా౦గ్ గా ఫీల్ అవ్వడం మూలానా

 

5).లక్ష్మీ’స్ N.T.R సినిమాలో NTR గారి జీవిత చరిత్ర యధావిధిగా చూపిస్తార లేక మీకు అనుకూలంగా సినిమా తీస్తున్నార?

 

భగవంతుని సాక్షిగా కేవలం జరిగిన నిజాలే చూపెడతా౦

 

6).ఈ సినిమా వల్ల తెలుగుదేశం పార్టీకి లాభం చేకూరుతుందా లేక నష్టం చేకూరుతుందా?

 

ము౦దే చెప్పానుగా..ఈ సినిమా రాజకీయాలకు అతీతమని

 

7).ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు NTR గారిని వెన్నుపోటు పొడిచారని విమర్శిస్తూ ఉంటారు ఈ విషయం ఈ సినిమాలో చూపి౦చబోతున్నారా?

 

అది సినిమాలో చూడండి

 

8).లక్ష్మీ’స్ NTR చిత్రం రాంగోపాల్ వర్మ తీయకపోవటమే మ౦చిదని చాలామంది అభిప్రాయ పడుతు౦టే మీరు ఎ౦దుకు ఈ సినిమాను నిర్మిస్తున్నారు?

 

నేను నా మనసుని,రాంగోపాల్ వర్మ గారి నిజాయితీని నమ్ముతున్నాను

 

9). ఈ సిమిమా ఎఫెక్ట్ రాబోయే ఎన్నికలపై పడే అవకాశం ఉ౦దా?

 

ఈ సినిమా రాజకీయాలకి అతీతం..కాని ప్రజల మనసులో మాత్రం అన్ని విదాలుగా బా౦బులు పేల్చడం ఖాయం

 

10).మహనీయుడు NTR పై మీ అభిప్రాయం ఏమి?

 

మహా మహనీయుడు

 

11).కేవలం YSR కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనం కోసమే రాంగోపాల్ వర్మతో ఈ సినిమా తీయిస్తు౦ది?

 

ఇది కేవల౦ నా వ్యక్తిగత నిర్ణయం

 

12).ఈ సినిమాకు మీరు పెట్టుబడి ఎ౦త పెడుతున్నారు?

 

రాంగోపాల్ వర్మ కి ఎ౦త అవసరమైతే అ౦త..ఇలాంటి చరిత్ర సృష్టించే సినిమాని డబ్బుతో కొలిచే౦త మూర్ఖున్ని కాను

 

13).ఈ సినిమాలో ఎవరెవరు నటి౦చబోతున్నారు?

 

అది రాంగోపాల్ వర్మ గారికే వదిలేసాను

 

14).ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

 

రాంగోపాల్ వర్మ రెడీ అయినప్పుడు.. రిలీస్ మాత్రం అక్టోబర్ 2018 దరిదాపుల్లో ఉంటుంది

 

15).ఏఏ ప్రదేశంలో ఈ సినిమాను చిత్రీకరిస్తారు?

 

అది రాంగోపాల్ వర్మ నిర్ణయిస్తారు

 

16..ఈ సినిమా తీసే ము౦దు మీరు గాని రాంగోపాల్ వర్మ గాని లక్ష్మీ పార్వతి గారితో మాట్లాడారా?

 

నేను మాములుగా మాట్లాడాను..సినిమా గురించి కాదు..రాంగోపాల్ వర్మ మాట్లాడలేదు

 

17.రాంగోపాల్ వర్మ గారు తీస్తున్న ఈ సినిమా కా౦ప్రహిన్సివ్ గా తీయాలని NTR గారి కుటుంబ సభ్యులు అ౦దరితో చర్చి౦చి తీయాలని అంటున్నారు?
మరి వారి కుటుంబ సభ్యులతో చర్చి౦చారా?

 

ఈ సినిమా కేవలం రాంగోపాల్ వర్మ అర్థం చేసుకున్న బహిరంగ నిజాల గురించి

 

18)రాంగోపాల్ వర్మ ఈ సినిమాలోNTR గారి పరువును బజారుకు ఈడ్చే విధంగా ఎ ఒక్క అంశం ఉన్నా ఊరుకోమని వార్ని౦గ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది?
మరి అలాంటి వార్ని౦గ్ మీకు ఎవరైనా ఇచ్చారా?

 

ఎవ్వరూ ఇవ్వలేదు.. ఒకవేళ ఇచ్చినా భయపడట౦ నా రక్తంలో లేదు

 

19).YSR కాంగ్రెస్ పార్టీకు చెందిన మీరు ఈ సినిమాకు నిర్మాతగా ఉన్న౦దుకు తెలుగుదేశం పార్టీ నాయకులు,NTR గారి అభిమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది?

 

నేను నమ్మిన సినిమాని తీయటానికి నాకు ప్రజాస్వామ్యపు హక్కు ఉంది

 

20).ఈ సినిమాలో NTR గారి కుటుంబ సభ్యుల అ౦దరి పాత్ర ఉ౦టు౦దా?

 

అది సినిమాలో చూడండి

 

21).ఈ సినిమాలోNTR గారికి నిజ౦గా ఎక్కడ ఎవ్వరి వల్ల అవమానం జరిగిందో చూపి౦చే దమ్ము,ధైర్యం రాంగోపాల్ వర్మకు ఉ౦దా?

 

దమ్ము ముందు పుట్టి రాంగోపాల్ వర్మ తర్వాత పుట్డాడు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat