Home / SLIDER / మంత్రులు హరీష్ ,కేటీఆర్ లపై సీఎం కేసీఆర్ చమత్కారాలు ..

మంత్రులు హరీష్ ,కేటీఆర్ లపై సీఎం కేసీఆర్ చమత్కారాలు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న సిద్ధిపేట ,సిరిసిల్ల జిల్లాలలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రెండు జిల్లాల కలెక్టర్ ,ఎస్పీ ,డీఎస్పీ ,కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేశారు .ఈ సందర్భంగా సిద్ధిపేటలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తన్నీరు హరీష్ రావు మీద ప్రశంసల వర్షం కురిపించారు .

మంత్రి హరీష్ రావు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు ఈ మధ్య బాగా హుషారైండు .మొదట జిల్లా ఇస్తే చాలు అని అన్నడు .జిల్లాను మంజూరు చేశాం .మెడికల్ కాలేజ్ అడిగాడు .అది శంఖుస్థాపన చేశాం .ఏడాది లోపు బ్రహ్మాండంగా కలెక్టరేట్ ,ఎస్పీ కార్యాలయం రాబోతున్నాయని అన్నారు .ఇంకా సిరిసిల్ల లో మాట్లాడుతూ మీ ఎమ్మెల్యే మంత్రి రామారావు బాగా ఉషారైండు .

సిరిసిల్ల నీళ్ళు బాగా ఒంటబడ్డాయి .జిల్లా ఇస్తే ఇంకా ఏమి అడగను అని అన్నారు .ఇప్పుడు ఏకంగా మూడు వందల నాలుగు వందల కోట్లకు దెబ్బపెట్టాడు అంటూ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి చమత్కరించారు .ఎగిర్త సుట్టం అంటారు చూశారా ..?.వాడు పొద్దున్న లేవంగానే పోతా పోతా అంటాడు .ఇంకా వంట కాలేదు బిడ్డా రాత్రి చల్లన్నం బుక్కెడంత ఉంది తినిపోతవా అని పెద్దమ్మ అంటుంది .చల్లన్నం ఎందుకు పెద్దమ్మా ..ఉడుకన్నం అయ్యేదాకా ఉంటానని అన్నాడటా ..రామారావుది గట్లే ఉంది .జిల్లా ఇస్తే సరిపోతుంది అని అడిగి ఇప్పుడు నిధులు అడుగుతున్నాడు .అందులో నా పెండ్లి కూడా ఇక్కడే జరిగింది అని గుర్తు చేస్తుండు అంటూ నవ్వేశారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat