జీవితాంతం సంతోషంగా, ఏ కష్టం రానీయకుండా చూసుకుంటానని పెళ్లినాడు భర్త చేసిన బాసలను పెడ చెవిన పెట్టిన ఓ ప్రబుద్ధురాలు… చివరకు భర్తకే ముచ్చెమటలు పట్టించింది. తన కాపురంలో తనే నిప్పులు పోసుకుంది. భర్తను బంధించి.. ప్రియుడితో రొమాన్స్‌కు రెడీ అయింది. చివరకు.. సినిమా చివరి సీన్లా జైలు పాలైంది. ఈ ఘటన హైదరాబాద్ నగర పరిధిలోగల నారాయణగూడలో ఈ రోజు చోటుచేసుకుంది. జ్ఞానేశ్వర్, సునీత భార్యా భర్తలు, వీరు ప్రస్తుతం నారాయణగూడలో నివాసం ఉంటున్నారు.
అయితే సునీత శ్రీనివాస్ అనే ప్రియుడితో గత కొన్నేళ్ల నుంచి ప్రేమకలాపాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తమ రొమాన్స్‌కి జ్ఞానేశ్వర్ అడ్డు వస్తున్నాడని భావించిన సునీత, శ్రీనివాస్ కిడ్నాప్ పథకం రచించారు. అనుకున్న విధంగానే జ్ఞానేశ్వర్‌ను కిడ్నాప్ చేసి కీసరలో బంధించారు. కీసరలో బంధీలో ఉన్న జ్ఞానేశ్వరలో చివరకు ఎలాగోలా తప్పించుకుని నారాయణగూడ పోలీసులకు కిడ్నాప్ ఉదంతంపై ఫిర్యాదు చేశారు. జ్ఞానేశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.