యువతి – యువకులు పెళ్లి చేసుకోవాలంటే ముందుగా శృంగారంలో పాల్గొనాలి. అలా పాల్గొన్న తరువాత ప్రెగ్నెన్సీ వస్తే వివాహాం చేసుకుంటారు. ఒకవేళ ప్రెగ్నెన్సీ లేక పోతే వదిలేస్తారు. ఇలాంటి వింత సాంపద్రాయం తమిళనాడులోని టోడ అనే అడవి జాతి సాంప్రదాయంలో ఉంది.ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది అక్షర సత్యం.
ముందుగా ఆ తెగలో యువతికి పెళ్లి చేయాలంటే తమకు నచ్చిన యువకుడితో సంసారం చేయాలి. అలా సంసారం చేసిన నెలరోజులకు గర్భంరావాలి. అలా వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటారు. ఒక వేళ గర్భం రాకపోతే ఆ వ్యక్తి వద్దకు మరో ఇద్దరు అమ్మాయిల్ని పంపిస్తారు. వారికి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే పెళ్లి లేకుండా జీవితాంతం ఒంటరిగా జీవించాల్సిందే. ఒక వేళ తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన తర్వాత గర్బవతి అయితే ఆమె అక్కడే 7 నెలల పాటు ఉంటుంది. అనంతరం టోడ జాతి పవిత్రంగా పూజించే చెట్టు కొమ్మతో చేసిన బాణాన్ని భర్త…, భార్యకు సమర్పిస్తాడు. అలా బాణం, విల్లు నచ్చినట్లయితే అతడిని ఆమె తన భర్తగా ఒప్పుకుంటుంది.
ఎవరైనా ఈ సంప్రదాయన్ని వ్యతిరేకిస్తే చంపేయడం, లేదంటే తెగ నుంచి బహిష్కరణకు గురి చేయడం లాంటివి చేస్తామని ఆ తెగకు చెందిన పెద్దలు చెబుతున్నారు.