2008 మే 16న నోయిడాలోని జలవాయి విహార్‌లో.. వారం రోజుల్లో పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉన్న 14 ఏళ్ల ఆరుషి అత్యంత పాశవికంగా హత్యకు గురైంది. పనిమనిషి హేమరాజ్‌తో కలిసి ఆరుషి తల్లిదండ్రులు నుపూర్ తల్వార్, రాజేష్ తల్వార్ ఆమెను హత్య చేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టు 2013లో తీర్పుచెప్పింది. దీంతో ఈ కేసులో వీరిద్దరికీ జీవిత ఖైదు పడింది. ఆ తర్వాత వారు ఈ తీర్పుపై అలహాబాద్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.
ఆరుషి తల్లిదండ్రులు చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాతో కూడిన హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్‌లో విచారణ చేపట్టింది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు గురువారం (అక్టోబర్ 12) తుది తీర్పును వెలువరించింది.
ఆరుషి హత్యకేసు అప్పట్లో దేశంలో సంచలనం సృష్టించింది. మొదట పని మనిషి హేమరాజే ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానించారు. అయితే ఆరుషి హత్యకు గురైన ఫ్లాట్‌లోని టెర్రాస్‌పై రెండు రోజుల తర్వాత హేమరాజ్ కూడా విగతజీవిగా పడి ఉండటంతో కేసు మరో మలుపు తిరిగింది. తల్వార్ దంపతులను అనుమానించిన పోలీసులు.. ఆ దిశగా దర్యాప్తు జరిపి ఆరుషి, హేమరాజ్ హత్యలకు రాజేష్, నుపూరే కారణమనే నిర్ధారణకు వచ్చారు.
అయితే.. దర్యాప్తును తప్పుదోవ పట్టించడానికి పోలీసులే ఇలాంటి అభియోగాలు మోపారంటూ తల్వార్ దంపతులు వాదించారు. దీంతో 2008లో నాటి ఉత్తరప్రదేశ్ సీఎం మాయావతి ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అనేక మలుపులు తిరిగిన అనంతరం సీబీఐ ప్రత్యేక కోర్టు అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగా.. ఆరుషి తల్లిదండ్రులను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది.
ఆరుషి హత్య కేసులో 2013లో ఆమె తల్లిదండ్రులకు జీవిత ఖైదు పడింది. యూపీ పోలీసులు 2008 మే 23న రాజేష్‌ను అరెస్టు చేసి దస్నా జైలుకు పంపారు. అనంతరం 2012లో రాజేష్ బార్య నుపూర్.. ఘజియాబాద్ కోర్టులో లొంగిపోవడంతో ఆమెను కూడా దస్నా జైలుకు పంపారు. ప్రస్తుతం ఈ కేసు నుంచి వీరికి ఊరట లభించడంతో.. తక్షణమే జైలు నుంచి విడుదల కానున్నారు.