తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నల్లగొండ సమస్యలను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లున్న జిల్లా పాత నల్లగొండ జిల్లా. 60 సంవత్సరాల చరిత్రలో జిల్లా నాయకులు చేయని పనిని తాను తలపెట్టినట్లు సీఎం తెలిపారు.
4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో మొట్టమొదటి ఆల్ట్రా మెగాపవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ నిర్మాణం నల్లగొండ జిల్లా దామరచర్లలో తలపెట్టినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైనట్లు.. మరో ఏడాదిన్నరో పనులు పూర్తై ఉత్పత్తి ప్రారంభం కానున్నట్లు సీఎం పేర్కొన్నారు. దీంతో ఈ ప్రాంత అభివృద్ధే మారిపోతుందని వెల్లడించారు.