ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి.. అధికారిక పర్యటనలు, సమావేశాలతో ఎప్పుడూ బిజీగా ఉంటారు.. అయితేనేం తన బాల్యమిత్రులను మరిచిపోలేదు. ఒక పర్యటనకు వెళ్తూ మధ్యలో కాన్వాయ్‌ను ఆపించి మరీ తన చిన్ననాటి మిత్రులను పలకరించారు. అంతేకాదు వారిని తన వాహనంలో ఎక్కించుకొని తనతోపాటు తీసుకువెళ్లారు. ఆయనెవరో కాదు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.జిల్లా సమీకృత కార్యాలయాల శంకుస్థాపన కోసం సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లాకు బయలుదేరారు. ములుగు వద్ద జాతీయరహదారిపై కాసేపు కాన్వాయ్‌ని ఆపి సీఎం తన బాల్య మిత్రులు జహంగీర్, అంజిరెడ్డిలను పలకరించారు. అనంతరం సిద్దిపేట పర్యటనకు వారిని తన వాహనంలో తీసుకెళ్లారు. కేసీఆర్ నుంచి వూహించని ఈ స్పందనతో ఆయన మిత్రులతోపాటు స్థానికులు, అధికారులు ఆశ్చర్యంలో మునిగితేలారు.
