Home / MOVIES / బుల్లితెర పై శృతిమించిన‌ శ్రీముఖి..!

బుల్లితెర పై శృతిమించిన‌ శ్రీముఖి..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద సెన్షేష‌న్ క్రియేట్ చేసిన అర్జున్ రెడ్డి రిలీజ్‌కు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా విడుదలకు ముందు, విడుదల తర్వాత కూడా ఎన్నో వివాదాలు ఎదుర్కొని సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. బయట జరుగుతున్నదే చూపించారు అని సినిమాని పొగిడిన వాళ్లుంటే, ఈ సినిమా చూసి చాలామంది అబ్బాయిలు అర్జున్ రెడ్డిలు అవుతారని తిట్టినవాళ్లున్నారు. సీనియ‌ర్ పొలిటీషియ‌న్ వి. హ‌నుమంత‌రావు చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. ఇక బుల్ల‌తెర యాంక‌ర్ అన‌సూయ కూడా న్యూస్ ఛాన‌ల్‌లో పెద్ద చ‌ర్చా కార్య‌క్ర‌మ‌మే పెట్టింది. అయినా కూడా అర్జున్ రెడ్డి సంచ‌ల‌న విజ‌యాన్ని మాత్రం ఎవ‌రూ ఆప‌లేక పోయారు.

ఇక అస‌లు విష‌యం ఏంటంటే అర్జున్ రెడ్డి చిత్రంలో ఎవడ్రా వాడు మా*ద్ డైలాగ్ పై చాలా మంది విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. ఆరోజు విమ‌ర్శించిన వాళ్ళంతా ఇప్పుడు.. బుల్లితెర పై ఇప్పుడు శ్రీముఖిని కళ్లప్పగించి చూస్తున్నారు. మా*ద్ డైలాగ్‌ను కొంచెం మార్చి సేమ్‌టుసేమ్ అదే సైన్‌తో శ్రీముఖి ఒక ప్రోగ్రాంతో యాక్ట్ చేసింది. ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వారితో కూడా డబుల్ మీనింగ్ డైలాగ్సే మాట్లాడింది. అప్పుడు సినిమా పట్ల వచ్చిన విమర్శలు..ఇప్పుడు ఈ ప్రోగ్రాం పట్ల రావాలి కదా. అరెరె ఇది కామెడి రా బై అని కొట్టి పారేస్తారా.. అలా చాలానే కొట్టిపారేశారు. మన నట్టింట్లో ఎన్నో ఛానళ్లు ఎన్నో ప్రోగ్రాంలో అర్జున్ రెడ్డి సినిమాకి మించిన బూతులు వస్తున్నాయి. వాటిని మనం చూస్తున్నాం. మనకెందుకులే అని వదిలేస్తున్నాం.. అప్పుడు అర్జున్ రెడ్డి విషయంలో వచ్చిన కామెంట్స్ ఇప్పుడు ఈ ప్రోగ్రాం గురించి ఎందుకు రావట్లేదో.. అర్జున్ రెడ్డిని విమ‌ర్శించిన వారే ఆత్మ‌విమ‌ర్శ చేసుకోవాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat