ఏపీ రాజకీయ సినీ వర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సంబందించిన ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెల్పిన జనసేన.. ఏపీలో జరగబోయే వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో దిగడం ఖాయమని తేల్చేసారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనసేన పోటీ చేయనుందని జనసేన ప్రకటించింది కూడా. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆయన పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక చాలమంది అసంతృప్తి నేతలు జనసేన లోకి దూకాలని ప్రయత్నాలు కూడా ముమ్మరం చేశారు. అయితే వాళ్ళందరికీ షాక్ ఇస్తూ.. తాజాగా నాలుగోసారి తండ్రి అయిన పవన్ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయితే అసలు విషయం ఏంటంటే.. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. అధిక సంతానం కల్గినందుకు.. కేవలం సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే అర్హత మాత్రం పవన్ కోల్పోయాడు. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం అధిక సంతానం ఉన్నవాళ్ళు పోటీ చేయకూడదు. కానీ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఆ నిబంధన లేదు. ఎంతమంది సంతానం ఉన్నా ఎన్నికల్లొ పోటీ చెయ్యొచ్చు. ఇప్పుడు తాజాగా ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడా మన నాయకుల తెలివికి అబ్బురపడిపోతున్నారు. ఎక్కువ మంది సంతానం ఉన్న వారిని పోటీకీ అనర్హులుగా చేయడం అవసరమే. ప్రస్తుతం ఒక రాజకీయ నేతకి ఒక కొడుకు ఉంటేనే వేల కోట్ల అవినీతి ఆరోపణల కథలు వస్తున్నాయి. ఇక ఎక్కువ మంది సంతానం ఉంటే.. వాళ్ళందరూ అనధికారికంగా అధికారం చలాయిస్తూ ఉంటే తట్టుకోగలమా.. అయితే ఆ రూల్‌ని కేవలం సర్పంచ్ స్థాయి ఎన్నికలకు పరిమితం చేయడంలోనే మన నాయకుల రాజకీయం స్పష్టంగా కనిపిస్తోంది.. మన రాజకీయ నాయకుల ముందు ఎలాంటి రాజ్యాంగాలు అయినా పని చేయవని.. రూల్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయని విశ్లేషకులు చర్చిచుకుంటున్నారు.