జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన సంగతి అందరికి తెల్సిందే. ఆయన మూడో భార్య లెజ్ నోవా మంగళవారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక పవన్ అభిమానుల దగ్గరి నుండి సినీ ప్రముఖుల వరకు అందరూ పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే మంగళవారం ఈ ఫోటో వైరల్‌గా మారితే బుధవారం ఉదయం నుండి ఈ బాబుకి పవన్ కళ్యాణ్ ఏ పేరు పెడతాడనే చర్చ మొదలయింది. ఇక తన భార్య క్రిష్టియన్ కావడంతో ఈ బాబుకు కూడా క్రిష్టియన్ పేరు పెడతారని సమాచారం. ఇప్పటికే వున్న ఆడబిడ్డకు అలాంటి పేరే వుంది. మరి దాన్ని బట్టే ఈ గ్యాసిప్ పుట్టిందని కొంతమంది అంటున్నారు. గతం లో చాల వేదికల పై పవన్ నాకు కులమతాలు లేవు. నా భార్య క్రిస్టియన్..అని ఆయన చాలా సార్లు అన్నారు. ఈ నేపథ్యం లో పవన్ తన నాల్గో బిడ్డకు ఏ పేరు పెడతాడో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.