టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు పరిటాల రవి గుండు కొట్టించాడనే వార్తలు.. అప్పట్లో సినీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపాయి. ఇక సోషల్ మీడియా జోరందుకున్నాక కూడా పవన్ గుండు కథపై ఇప్పటికీ రకరకాలుగా చర్చించుకుంటూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ గుండు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఏంజరిగిందంటే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 పేజీల్లో పవన్‌కు తనకు గొడవలు లేవని.. పనిమీద వెళ్లిన తనకి పవన్‌ను ప్రసాద్ ల్యాబ్ లో ఓ వ్యక్తి పరిచయం చేశాడని..అలా పవన్ తో ఒక్కసారే మాట్లాడినట్లు తన ఆత్మకథలో వివరించారు.
మరి ఇంత ఘోరమైన పుకార్లు ఎందుకు పుట్టించారంటే.. గతంలో పరిటాల రవి ఇంటికి ఆనుకొని ఉన్న యాక్టర్ జగ్గారావుకు చెందిన స్థలాన్ని చిరంజీవి10లక్షలకు కొన్నాడట.. అందులో 7లక్షలు డబ్బులు ఇచ్చి మిగిలిన రూ. 3లక్షలు తరువాత ఇస్తానని అన్నాడట చిరంజీవి. ఆ మూడలక్షల దగ్గర ఎందుకో వివాదం తలెత్తింది. ఈనేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ బాంబుపేలుళ్లు జరిగాయి. దీంతో భద్రత దృష్ట్యా మరింత సెక్యూరిటీ కోసం పరిటాల రవి ఆ స్థలాన్ని చిరంజీవిని తనకు అమ్మమని దానికి బదులుగా మాదాపూర్ లో ఎకరం ల్యాండ్ ఇస్తానని జగ్గారావుకు మూడు లక్షలు ఇచ్చి ఆ ఇష్యూని క్లియర్ చేశాడట .
చిరంజీవి కుతూరికి, ఉదయ్ కిరణ్‌కు జరిగే నిశ్చితార్ధానికి మీడియాని అనుమతించలేదు. అయినా కొంతమంది జర్నలిస్ట్‌లు గోడ చాటుగా, ఇంట్లో వాళ్లకు తెలియనీయకుండా ఫోటోస్ తీయడం చూసిన పవన్ వాళ్లని కొట్టాడట. అందులో నెల్లూరు వాసి అయిన ఓ జర్నలిస్ట్ .. పవన్ మీద కోపంతో ఏ ప్రూఫ్ లేని ఈ గుండు స్టోరీని పుట్టించేసి.. జగ్గారావు, చిరంజీవి వివాదంలో పరిటాలపై పవన్ దాడికి దిగాడని, కోపంతో రగిలిపోయిన పరిటాల.., పవన్‌కు గుండు కొట్టించాడని నెల్లూరు జిల్లానుంచి విడుదలయ్యే జమీన్ రైతు అనే పత్రిక ప్రింట్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇక యాంటీ ఫ్యాన్స్ దీనికి విస్తృత ప్రచారం కల్పించారు. ఇక తన సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ తన క్రియేటివిటీని ఊపయోగించి ఈ గుండు సీన్ తో తన సినిమా విజయాన్ని సొంతం చేసుకోవడం కోసం.. అప్పుడప్పుడే మరిచి పోతున్నవారికి ఇది అగ్నికి ఆజ్యం పోసేలా చేసిందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.