మెగా కాంఫౌడ్ నుండి వచ్చిన నాగబాబు తనయ నిహారిక నటించిన తొలి వెబ్ సీరిస్ ముద్దపప్పు ఆవకాయ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఓ రకంగా చెప్పాలంటే, తెలుగునాట వెబ్ సిరీస్‌లకు క్రేజ్ తెచ్చిన ఘనత నిహారికకే దక్కుతుంది. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో ఆ తర్వాత వెంటనే నాన్న కూచి అనే మరో వెబ్ సిరీస్ ను నిహారిక మొదలుపెట్టింది. రియల్ లైఫ్‌లో తండ్రీ కూతుళ్లైన నాగబాబు, నిహారికలు ఈ వెబ్ సిరీస్‌లో తండ్రీ కూతుళ్లుగా నటించారు. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న నాన్న కూచి వెబ్ సిరీస్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
ముద్దపప్పు ఆవకాయకు దర్శకత్వం వహించిన ప్రణీత్ బ్రహాండపల్లి ఈ వెబ్ సిరీస్ ను కూడా డైరక్ట్ చేశాడు. ముద్దపప్పు ఆవకాయ తర్వాత వస్తున్న వెబ్ సిరీస్ కావడంతో.. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారట. అలాగే ఈ వెబ్ సిరీస్ ను ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరవేసేందుకు తెలుగులో ఉన్న పాపులర్ డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌తో నిహారిక సంప్రదింపులు జరపుతుందోట. ప్రస్తుతం ఈ చర్చలు కొలిక్కి వస్తున్నాయని.. అతి త్వరలోనే నాన్నకూచి ప్రేక్షకులను పలకరిస్తుందని.. ఈ నెలఖారులో లేదా వచ్చే నెల మొదటివారంలో తమ వెబ్ సిరీస్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.