Home / ANDHRAPRADESH / ఐటీ కంపెనీలు విశాఖకు రావు.. తన అసమర్థతను ఒప్పేసుకున్న లోకేష్…!

ఐటీ కంపెనీలు విశాఖకు రావు.. తన అసమర్థతను ఒప్పేసుకున్న లోకేష్…!

ఒకపక్క తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు, ఐటీ మినిష్టర్ కేటీఆర్ రాష్ట్రానికి రోజుకో ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రప్పిస్తుంటే..మరో పక్క్ ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు, ఐటీ మినిష్టర్ లోకేష్ మాత్రం రాష్ట్రానికి ఐటీ కంపెనీలు రావంటూ తన అసమర్థతను బహిరంగంగా ఒప్పేసుకుంటున్నాడు..గత సార్వత్రిక ఎన్నికలకు ముందు హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టా..ఐటీలో నంబర్‌వన్ చేశా..అసలు ఐటీని పరిచయం చేసిందే నేను..అధికారంలోకి వస్తే నవ్యాంధ్రను ఐటీ స్టేట్‌గా మార్చేస్తా..విశాఖను ఐటీ కేపిటల్‌గా చేస్తా అని చంద్రబాబు బీరాలు పలికాడు. తీరా అధికారంలోకి వచ్చాక ఐటీ రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌గా వెలిగిపోతుంటే..ఏపీ వెలవెలబోతుంది. తొలుత ఐటీ శాఖ మంత్రిగా ఉన్న పల్లెరఘనాథరావు కేటీఆర్‌తో పోటీపడలేకపోతున్నాడని, రాష్ట్రానికి ఐటీ కంపెనీలను తీసుకురావడంలో వెనకబడిపోయాడనే నెపంతో ఆయన్ని తప్పించిన తన కొడుకు లోకేష్‌కు ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించాడు చంద్రబాబు. మంత్రిగా పగ్గాలు చేపట్టగానే అమెరికాలో తనకున్న పరిచయాలతో ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలను రప్పిస్తానని రెండేళ్లలో లక్షలాది ఐటీ జాబ్స్‌ ఏపీ యువతకు ఇప్పిస్తానని, విశాఖను ఐటీ హబ్‌గా మారుస్తానని చంద్రబాబులాగే లోకేష్ కూడా గొప్పలు చెప్పాడు..మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆర్నెల్లు కాకముందే విశాఖకు ఐటీ కంపెనీలు రావంటూ లోకేష్ తన అసమర్థతను బహిరంగంగానే ఒప్పేసుకుంటున్నాడు. తాజాగా విశాఖ టూర్‌లో ఉన్న లోకేష్ వైజాగ్‌లో తమ కార్యాలయాలు నెలకొల్పేందుకు ప్రఖ్యాత ఐటీ కంపెనీలే కాదు..చిన్న స్థాయి ఐటీ కంపెనీలు కూడా ముందుకు రావట్లేదని వాపోయాడు… దీనికి గల కారణాలను కూడా లోకేష్ వివరిస్తున్నాడు..వైజాగ్‌లో సోషల్ ఎకో సిస్టమ్ లేదని.డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా లేవని లోకేష్ అన్నాడు..అదేంటి అధికారంలోకి రాగానే ఏడాది కల్లా ఏపీలోని అన్ని ప్రధాన నగరాల్లో ఎయిర్‌పోర్ట్‌లు కట్టిస్తాం..విశాఖ, విజయవాడ నుంచి అమెరికా, సింగపూర్‌లకు డైరెక్ట్ విమాన సౌకర్యం కల్పిస్తాం అని మీరే చెప్పారు కదా అంటే లోకేష్ దగ్గర సమాధానం లేదు..అంతే కాదు విశా‌‌‌ఖలో అంతర్జాతీయ స్థాయి స్కూల్స్ లేవని అందుకే ఐటీ కంపెనీలు హైదరాబాద్, బెంగళూరు నగరాలను వదిలి విశాఖకు రావడానికి సిద్ధంగా లేవని లోకేష్ తేల్చి చెప్పాడు.
వాస్తవ పరిస్థితిని నిజాయితీగా వెల్లడించినందుకు అభినందించాలో ఐటీ శాఖ మంత్రిగా తన అసమర్థతను ఒప్పుకున్న లోకేష్‌ను తిట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఏపీలో ఐటీ వెలుగులు కష్టమే అని లోకేష్ ఒప్పుకున్నట్లయింది…ఇదీ బాబు సర్కారు ఘనత..ఏం చేస్తాం..ఓట్లేసినందుకు ప్రజలు అనుభవించాల్సిందే..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat