తమిళ స్టార్ హాస్య నటుడు సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదైంది. దీంతో అతను అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలిసింది. వివరాల్లోకి వెళితే కాంట్రాక్టర్ షణ్ముగసుందరంతో కలసి కుండ్రత్తూర్ సమీపంలోని కోవూర్ ప్రాంతంలో కల్యాణ మండపాన్ని కట్టడానికి సన్నాహాలు ప్లాన్ వేశాడు సంతానం. అందుకు తన భాగంగా భారీ మొత్తాన్ని షణ్ముగసుందరానికి ఇచ్చాడు. తర్వాత కల్యాణ మండపం నిర్మాణ నిర్ణయాన్ని ఇద్దరూ విరమించుకున్నారు.
దీంతో తన డబ్బులను వెనక్కి ఇచ్చేయాలని అడిగాడు సంతానం. కొంత మొత్తం ఇచ్చిన షణ్ముఖసుందరం మిగిలిన మొత్తం ఇవ్వకుండా కాలయాపన చేశాడు. ఈ నేపథ్యంలో సంతానం తన మేనేజర్ రమేశ్‌తో కలిసి వలసరవాక్కంలోని షణ్ముఖసుందరం కార్యాలయానికి సోమవారం వెళ్లి మిగిలిన డబ్బులు ఇచ్చేయాలని డిమాండ్ చేశారని, ఈ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి.. చివరకు ఘర్షణకు దారితీయడంతో ఒకరిపైదాడి చేసుకున్నారు. ఇరువర్గాలకు గాయాలు కుడా అయ్యాయి. ఈ మేరకు షణ్ముఖసుందరం పోలీసులను ఆశ్రయించగా, సంతానంపై కేసు నమోదు అయ్యింది. అయితే ప్రస్తుతం సంతానం అజ్ఞాతంలో వున్నట్లు తెలుస్తుంది.