తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సిద్దపేట జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషరేట్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “తనకు జన్మనిచ్చింది..రాజకీయంగా జన్మనిచ్చింది కూడా సిద్దిపేట అని తెలిపారు. తెలంగాణకు గుండెకాయలాంటి జిల్లా సిద్దిపేట..అనర్గళ గళమిచ్చింది..
పోరాట బలమిచ్చింది సిద్దిపేటని సీఎం స్పష్టం చేశారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగిస్తూ ఏపీ, వెస్ట్ బెంగాల్ తప్ప అన్ని రాష్ర్టాలు పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాయి. సిద్దిపేట జిల్లా కావాలని గతంలో నేనే స్వయంగా ఎన్టీఆర్‌కు వినతి పత్రం ఇచ్చినా. అయినా సిద్దిపేటను జిల్లాగా చేయలేకపోయిన్రని పేర్కొన్నారు.
సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సీఎం ఆకాంక్షించారు. ఎవరూ చేయని ధైర్యం చేసి 10 జిల్లాలలను 31 జిల్లాలుగా చేసుకున్నాం. నా గురువుల దయతో ఈ మట్టిలో మొలిచిన మొక్కను నేను అని సీఎం అన్నారు. బతికి ఉండగానే కోరిన రాష్ర్టాన్ని సాధించుకున్నందుకు నా జన్మ ధన్యమైందని ముఖ్యమంత్రి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు .