ఆసీస్ తో నిన్న జరిగిన రెండో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి డకౌటయ్యాడు. ఇలాంటి మ్యాచ్‌లో విరాట్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? .అవును అది రికార్డే .ఆ డకౌటే రికార్డు మరి.
కోహ్లికి టీ20ల్లో ఇది తొలి డకౌట్ కావడం విశేషం. ఈ క్రమంలో అతను ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు. డకౌట్ లేకుండా ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడిన రికార్డు అది. 47 టీ20ల తర్వాత విరాట్ తొలిసారి డకౌటయ్యాడు. 40 మ్యాచ్‌లతో పాక్ బ్యాట్స్‌మన్ షోయబ్ మాలిక్ పేరిట ఉన్న రికార్డును విరాట్ బీట్ చేశాడు.