తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన బాటలోనే సిద్దిపేట జిల్లాను అభివృద్ధి చేస్తున్నమని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వెల్లడించారు. ఈ రోజు జిల్లాలో కొండపాక మండలం దుద్దెడలో జిల్లా కార్యాలయ సముదాయం, పోలీస్‌కమిషనరేట్ నిర్మాణాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దిపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ 25 ఏండ్ల కిందటే సిద్దిపేటలో ఇంటింటికి నీళ్లు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దని అన్నారు. హరితహారంలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటినమన్నారు. సీఎం కేసీఆర్ కలలు కన్న విధంగా కోమటి చెరువును అభివృద్ధి చేస్తున్నమని ఆయన తెలిపారు.
