తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన మండలాలు, జిల్లాలు ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్బంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మరియు కాప్రా మండల కార్యాలయ ప్రాంగణంలో ప్రథమ వార్షికోత్సవ సంబురాలను ఘనంగా నిర్వహించారు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజల్ని అలరించాయి, ఈ కార్యక్రమానికి మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యదవ్, MP మల్లారెడ్డి, MLA సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డి, గారు యం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్, శ్రీ తాడూరి శ్రీనివాస్ గారు, నగర మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేసారు, ఈ కార్యక్రమంలో స్థానికులు, జిల్లా ప్రజలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
