ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేల ,ఎంపీల అభ్యర్ధులను ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేస్తూ వస్తోన్న సంగతి తెల్సిందే .గతంలో ఆన్లైన్ వెబ్ మీడియా సంచలనం ..ఉన్నది ఉన్నట్లు వార్తలను పబ్లిసిటీ చేసే దరువు .కామ్ రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గానికి 2019 లో జరగబోయే ఎన్నికలకు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బరిలోకి దించనున్నారు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెల్సిందే .
తాజాగా ఇదే కథనం అక్షర సత్యం అని వైసీపీ శ్రేణులు అంటున్నారు .ప్రస్తుతం కర్నూలు ఎంపీగా ఉన్న ప్రముఖ వ్యాపార వేత్త బుట్టా రేణుక రానున్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటి చేసి మంత్రి పదవి ఇవ్వనున్నారు అని జగన్ ఆమెకు బరోసా ఇవ్వడంతో కర్నూలు ఎంపీ స్థానం నుండి బలమైన ఆర్ధిక స్తోమత ప్రజలలో ఆదరణ ఉన్న నేతను రంగంలోకి దించాలని జగన్ ప్లాన్ చేశారు .
అందుకు తగ్గట్లు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని గెలుపు ఓటమిలను అంచనా వేసి ఈ స్థానాన్ని మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి ఇవ్వాలని ..అందుకు త్వరలోనే ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు అని ఇటు కోట్ల అనుచరవర్గం ఇటు వైసీపీ శ్రేణులు అంటున్నారు .