తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్వీ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం కోసం విద్యార్థి నాయకులకు సీఎం పలు సూచనలు చేశారు. వచ్చేవారంలో రాష్ట్ర, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణా తరగతులు ఉంటాయని సీఎం చెప్పారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించాలని విద్యార్థి నాయకులకు సీఎం సూచించారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్కసుమన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రజలకు వివరించాలని విద్యార్థి నాయకులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ స్థానాలు పెరిగితే విద్యార్థి విభాగానికి 2 సీట్లు కేటాయిస్తామన్నారు. అదేవిధంగా 3 ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 80 స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కష్టపడితే ఇంకా ఎక్కువ స్థానాలు గెలుస్తామని, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాని విద్యార్థి నాయకులకు సూచించారు.