వీకెండ్ వచ్చింది అంటే చాలు మందు ..బిర్యానీ ..దోస్తులతో ఎంజాయ్ ..తీరా ఎంజాయ్ చేసి ఇంటికి వస్తోన్న మార్గంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సమస్య .ఎట్లాగో అట్లాగో వద్దామని ప్రయత్నాలు చేస్తుంటే ట్రాపిక్ పోలీసులు అడ్డు తగిలి నోట్లో అదేదో పెట్టి ..అంత త్రాగావు ..ఇంత త్రాగావు అని కేసులు ..కౌన్సిలింగ్ లు .అయితే త్వరలో వీటి భారి నుండి తప్పుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి .
ఇప్పటివరకు డ్రంక్ ఆండ్ డ్రైవ్‌ల దొరికితే 100 ఎంఎల్ రక్తంలో 30 ఎంజీ బీఏసీ (బ్లడ్ ఆల్కహాల్ కౌంట్) ఉంటే కేసు రాసి కౌన్సెలింగ్ ఇస్తున్నారు . కానీ త్వరలో దీనిని 30 నుంచి 100కు పెంచే ఆలోచనలో సర్కారు ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి .
ఒకవేళ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటే ఇక నుండి 100లోపు ఉంటె కేసులు ..కౌన్సలింగ్ లు ఉండవు అన్నమాట .అయితే ఒకవేళ సర్కారు తీసుకునే ఈ నిర్ణయం వలన 100 పాయింట్ల దాక చాన్స్ ఉంది కదా అని పీకల దాక మందు తాగి బండి నడిపితే అనుకోని ప్రమాదం ఎదురైతే మనలని నమ్ముకున్న కుటుంబం రోడ్డున పడటం ఖాయం ..సో మందు బాబులు ఈ మాటను కొంచెం గుర్తు పెట్టుకోండి .