భారత పర్యటనకు వచ్చిన రష్యన్ యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో బిచ్చగాడి అవతారం ఎత్తాడు. తన చేతిలో డబ్బులు అయిపోవడం, ఏటీఎం కార్డు లాక్ కావడంతో ఎవాంజెలిన్ బెర్డ్నికోవ్ తమిళనాడులోని శ్రీ కుమారకొట్టం మురుగన్ దేవాలయ ప్రవేశ ద్వారం భిక్షాటన చేశాడు. విదేశీయుడు గుడి దగ్గర అడుక్కుంటున్నాడనే సమాచారం అందుకున్న శివ కంచీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అతడి దగ్గరున్న ట్రావెల్ డాక్యుమెంట్లను పరిశీలించి.. అన్నీ సక్రమంగానే ఉండటంతో సాయం కోసం చెన్నైలోని రష్యన్ ఎంబసీకి వెళ్లమని చెప్పి రూ. 500 అతడికి ఇచ్చారు.
ఈ విషయమై ‘ది హిందూ’ ప్రచురించిన కథనం చదివిన సుష్మా స్వరాజ్ రష్యన్ యువకుడికి సాయం చేస్తామని ట్వీట్ చేశారు. ‘ఎవాంజెలిన్.. రష్యా, భారత్ చిరకాల మిత్ర దేశాలు. చైన్నైలోని మా అధికారులు నీకు తోడ్పాటునందిస్తార’ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.