తెలంగాణలో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్ననిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభవార్త. 2017- డీఎస్సీ కు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం ప్రకటించింది .అందులో భాగంగా ఎస్ఈటీ నిబంధనల ప్రకారం డీఎస్సీ మార్గదర్శకాలను ఖరారు చేస్తూ జీవో విడుదలైంది. ఇందుకు సంబంధించిన ఫైల్ పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ,డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి సంతకం చేశారు.
దీనిలో భాగంగా డీఎస్సీకి దరఖాస్తు చేసే అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు, టెట్ వెయిటేజ్, తదితర నిబంధనలను ఈ జీవోలో పేర్కొంది.డీఎస్సీకి ఏపీ టెట్, టీఎస్ టెట్, క్వాలిఫై అయిన వారు అర్హులని, జిల్లా స్థానికత ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరగనున్నట్టు ప్రకటించింది.
అయితే డీఎస్సీ మార్గదర్శకాలను టీఎస్ పీఎస్సీకి చేరిన అనంతరం నోటిఫికేషన్ వెలువడనుంది. కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ప్రాతిపదికనే ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. 12 వేల పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్నది .