వచ్చే నెల నవంబర్ 2వ తేదీ నుంచి తాను చేపట్టనున్న పాదయాత్రపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం (ఈ నెల 11న) కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిశీలకులు, నియోజకవర్గ సమన్వయకర్తలకు ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పిలుపు అందింది.
వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలకు ఎంపీ విజయసాయిరెడ్డి సమాచారం అందించారు. పాదయాత్ర కార్యాచరణ గురించి చర్చించే.. ఈ సమావేశానికి ఆహ్వానం అందిన నేతలందరూ తప్పకుండా రావాలని ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. అయితే ఆ పాదయాత్రతో టీడీపీ నాయకులలో ఖచ్చితంగా అలజడలు మొదలౌవుతాయని రాజకీయ విశ్లేషకులు చేబుతున్నారు.