తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం అయిన హైదరాబాద్ లోని శంషాబాద్ లోని ఇంటర్నేషనల్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి మాసబ్ ట్యాంక్ కు దారితీసే పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ హైవేపై టాలీవుడ్ ప్రముఖ హీరో రాజశేఖర్, రాంరెడ్డి అనే వ్యక్తి ఇన్నోవా కారును ఢీ కొట్టిన సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భంగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆగ్రహానికి గురైన రాంరెడ్డి తాగి ఉన్నందువల్లే హీరో రాజశేఖర్ తన కారును ఢీ కొట్టాడని మాట్లాడుతూ ఉన్నఫలంగా ఫైర్ అయ్యారు .ఈ క్రమంలో రాంరెడ్డి మాట్లాడుతూ నువ్వు ‘తాగిలేవని చెప్పవద్దు…అది డాక్టర్లు తేల్చాల్సిన పని’ అంటూ హీరోపై మండిపడ్డారు. దీంతో కల్పించుకున్న హీరో రాజశేఖర్.. ‘మీరు నన్ను తిట్టాలని నిర్ణయించుకుంటే
తిట్టండి… పక్కనే నిల్చుంటాను’ అంటూ పక్కకెళ్లారు.దీంతో అంతవరకు కోపం వ్యక్తం చేసిన బాధితుడు కూడా నవ్వేశారు.
ఇంతలో ‘నేను తాగలేదు, ఒత్తిడిలో ఉండడంతో అలా జరిగిపోయింది. అంతే తప్ప చేయాలని చేసింది కాదు’ అంటూ రాజశేఖర్ వివరణ ఇచ్చారు. అయినా రాంరెడ్డి శాంతించలేదు.. ‘ఒక సినిమా హీరో రాజశేఖర్ గా మీపై నాకు గౌరవముంది. కానీ ఇలా వేరే ఎవరినో గుద్దేస్తే, వారికి ఏదైనా జరిగితే బాధ్యత ఏంటి? మీరు శిక్షార్హులా? కాదా?’ అంటూ నిలదీశారు.దీంతో రాంరెడ్డి మాటలతో ఏకీభవించిన హీరో రాజశేఖర్ ‘నిజమే.. మీకు ఏది న్యాయమనిపిస్తే అది చేయండి. నేను అడ్డుపడను’ అంటూ హుందాగా ఆయన ప్రవర్తించడంతో ఈ సమస్యకు సుఖవంతంగా ఎండ్ కార్డు పడింది .అయితే ఇటీవల ఒక ప్రముఖ స్టార్ హీరో రోడ్డు మీద ఉన్న డివైడర్ ను గుద్ది నానా రచ్చ చేసి అది తన డ్రైవర్ చేశాడు అని తప్పించుకున్నాడు .కానీ ఇక్కడ రాజశేఖర్ తప్పు ఉంటె మీకు ఏది అనిపిస్తే అది చేయమని చెప్పడం ఆయన హుందాతనానికి నిదర్శనం అని అక్కడ ఉన్నవారు వ్యాఖ్యానించారు .