Home / SLIDER / నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో ఐటీ పార్క్‌….

నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో ఐటీ పార్క్‌….

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను నిజామాబాద్‌ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ రోజు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌ ఏర్పాటు గురించి ఇరువురు చర్చించారు.

ఈ భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్‌లో ఐటీ పార్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్‌ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కవిత అన్నారు .

నిజామాబాద్‌ ఐటీ పార్క్‌తో ఉత్తర తెలంగాణకు మేలు చేకూరుతుందన్నారు. అలాగే పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని ఎంపీ కవిత ఈ సందర్భంగా పేర్కొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat