సినిమా రంగంలో ఒకప్పుడు కెప్టన్ ఆఫ్‌ది షిప్ అంటే నిర్మాతే.. అయితే రాను రానూ నిర్మాతల పరిస్థిరి క్యాషియర్ స్థాయికి దిగజారింది. ఓ సినిమా తెరకెక్కించాలంటే ముందుగా నిర్మాత కావాలి.. ఆయనతోనే సినిమా మొదలు అవుతుంది. సినిమా హిట్ అయినా కాకపోయినా దానిని తట్టుకునేది నిర్మాతే. అలంటి నిర్మాతను పచ్చి బూతులు తిట్టాడు అగ్ర హీరో. కేవలం బడ్జెట్ ఎక్కువ అవుతుందని కాస్త షెడ్యూల్ తగ్గిద్దామని అన్నాడట ఆ నిర్మాత.
దీంతో ఆగ్రహించిన ఆ హీరో ఏరా నా కొడకా.. తిక్కతిక్కగా ఉందా.. తాట తీస్తా.. ఇండస్ట్రీలో ఉండాలని లేదా. మా వంశం గురించి తెలిసే మాట్లాడుతున్నావా.. ఇంకోసారి ఈ టాపిక్ ఎత్తితే ఇండస్ట్రీలో కనిపించకుండా పోతావ్. ఒళ్లు దగ్గరపెట్టుకో.. అని గట్టి వార్నింగ్ ఇచ్చాడట. ప్రస్తుతం ఈ వ్యవహారం ఫిల్మ్ నగర్ సర్కల్‌లో హాట్ టాపిక్‌గా నడుస్తోంది. సదరు హీరోకు కూడా మూడేళ్ళుగా ఒక్క హిట్ కూడా లేదట. అయినాగానీ ఆయన పొగరు ఏ మాత్రం తగ్గలేదని అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఈ వ్యవహారం ఇక్కడితోనే సద్దుమణుగుతుందా.. లేక ఇంకాస్త ఎక్కువుతుందా అనేది చూడాలి.