తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో 2,718 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ చేయడానికి దస్త్రంపై సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ సంతకం చేశారు. 2016, డిసెంబర్ 31 నాటికి తగిన హాజరు శాతం గల ఈ కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామనీ, ఒకట్రెండు రోజుల్లో వీటిని కార్మికులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం 2,718 మందిలో బదిలీ వర్కర్లు 2,416 మంది, బదిలీ కోల్‌ఫిల్లర్లు 299 మంది, టెంపరరీ టన్నెలింగ్ మజ్దూర్లు ముగ్గురు ఉన్నారు. కాగా 21 మంది సెక్యూరిటీ గార్డులకు జమేదార్లుగా ప్రమోషన్లు కల్పించారు.
జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ కానున్న కార్మికుల సంఖ్య
రామగుండం-1 ఏరియాలో – 699 మంది
రామగుండం -2 ఏరియాలో – 446 మంది
మందమర్రి ఏరియాలో – 426 మంది
భూపాలపల్లి ఏరియాలో – 330 మంది
శ్రీరాంపూర్ ఏరియాలో – 269 మంది
కొత్తగూడెం ఏరియాలో – 266 మంది
రామగుండం -3 ఏరియాలో – 243 మంది
మణుగూరు ఏరియాలో – 26 మంది
బెల్లంపల్లి ఏరియాలో – 14 మంది