తమన్నా ఇటు తన అందాలతో అటు తన అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది .అంతే కాకుండా మొత్తం ఇండస్ట్రీలోనే తమన్నా మాదిరిగా తెల్లని పాలలో నుంచి తీసిన కుందనపు బొమ్మలా అందంతో కుర్రకారు మతిని పోగొట్టింది .అంతగా ఆదరణ ఉన్న ఆమె సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత తమ అభిమానులతో నేరుగా మాట్లాడుతూ అందరికి దగ్గరవుతుంది అమ్మడు .
దీనిలో భాగంగా సోషల్ మీడియాలో ట్విట్టర్, ఫేస్ బుక్ లలో లైవ్ ఛాట్ తో ఆకట్టుకుంటూ అభిమానులను మరింత అలరిస్తుంది తమ్ము .అందులో భాగంగా తమన్నా అభిమాలనులతో లైవ్ ఛాట్ నిర్వహించింది.ఈ సందర్భంగా తమ్ము అభిమాని ఒకరు ‘తెల్లగా ఉన్నావని పొగరా? నాకు రిప్లై ఇవ్వడం లేదు?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నించాడు. అయితే దీనిని లైట్ తీసుకున్న తమన్నా ‘అయ్యో… పొగరు కాదండి.
మీకు నా నమస్కారాలు. జీవితంలో మీకంతా మంచే జరగాలని కోరుకుంటున్నా’’ అంటూ సమాధానం చెప్పింది.అంతే కాదు తాను చేస్తున్న, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి అభిమానులకు వివరించింది అమ్మడు . ఆ సందర్భంగానే ‘‘సినిమాలు లేకుండా నా లైఫ్‌ని ఊహించుకోలేను. డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో
రూపొందే సినిమాలో నటించాలనేది నా డ్రీమ్’’ అంటూ తమన్నా తన మనసులో కోరికను బయటపెట్టింది .