విశ్వ నటుడు కమల్‌హాసన్ నవంబర్ ఏడున తన పుట్టిన రోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజల సపోర్ట్ ఎలా ఉంటుందో తెలియదు కీనీ.. కుటుంబ సభ్యల మద్దతు మాత్రం పెద్దగా లేదనే చెప్పాలి. ఇటీవల ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కమల్ సోదరుడు చారుహాసన్ తన తమ్ముడు రాజకీయ భవితవ్యంపై తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని.. ఆ లక్షణాలు అతడిలో లేవని ఆయన అబిప్రాయపడ్డారు. ఇక రజనీ కాంత్ రాజకీయాల్లోకి రాడని ఆయన తేల్చి పారేశారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకుల్లో కేంద్ర మంత్రి పీఎమ్ కే నాయకుడు అన్బుమణి రాందాస్‌కు మాత్రమే సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని ఆయన అన్నారు.
