ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో అధికారం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కురిపించిన హామీలు మొత్తం ఆరు వందలు .అధికారంలోకి వచ్చి మూడున్నరెండ్లు అయిన కానీ ఇంతవరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఇటు ప్రజానీకం అటు ప్రధాన ప్రతిపక్షాలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ.
అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని ..వారికి ప్రత్యేకంగా కార్పోరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయిస్తాం అని హామీల మీద హామీల వర్షం కురిపించారు .అందుకు తగ్గట్లు రిజర్వేషన్ల విషయాన్నీ పక్కన పెడితే కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్ గా చలమలశెట్టి రామనుజయ ను నియమించారు .
అయితే ఆయన పదవి కాలం వచ్చే నెలతో ముగియనున్నది .దీంతో ప్రస్తుతం కాపుల తరపున పోరాడుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కు మద్దతుగా కాపు చైర్మన్ మద్దతుగా నిలిచారు అని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి .అయితే రామనుజయ పనితీరు బాగున్నా కానీ బాగోలేదని ..ఆయన్ని ఆ పదవిలో ఉంటె కాపుల తరపున దిక్కర స్వరాన్ని వినిపిస్తాడు .ప్రభుత్వం మీద ..తమ పార్టీ మీద కాపు సామాజిక వర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చే విధంగా ఆయా సామాజిక వర్గంలో చైతన్యం తీసుకువస్తాడు అని భావించిన చంద్రబాబు ఈ పదవిలోకి తను చెప్పినట్లు ఆడే వ్యక్తిని కూర్చోబెట్టాలని చూస్తున్నాడు .దీంతో కాపులకు మరోసారి వెన్నుపోటు పొడవటానికి సిద్ధమయ్యాడు బాబు ..