సిద్దిపేట జిల్లాలోని రాజీవ్ రహదారి మీదుగా సిద్దిపేట వెళుతున్న మంత్రి హరీశ్‌రావు మర్కూక్ మండలం పాతూరు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన మోడల్ కూరగాయల రైతు బజార్‌ను సందర్శించారు. మంత్రి హరీష్ రావు వెంట మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహదారు వివేక్, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. మోడల్ మార్కెట్ రూపకల్పన ఎలా జరిగిందన్న విషయాన్ని హరీశ్ రావు వివేక్‌కు వివరించారు. మార్కెట్‌లో సౌకర్యాలు, గిరాకి గురించిన వివరాలను రైతుల నుంచి వివేక్ అడిగి తెలుసుకున్నారు.