టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హరోగా తన సోదరుడు ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఇటీవల విడుదల అయిన లేటెస్ట్ మూవీ “జై లవకుశ “.జైలవకుశ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల ధియేటర్స్ లో విడుదలై మొదటి షో నుండే బాక్సాపీస్ వద్ద సూపర్‌హిట్ టాక్‌తో ప్రదర్శించబడుతున్నది.
బాబీ డైరెక్షన్‌లో తెరకెక్కిన జై లవ కుశ మూవీ రెండో వారానికి మంచి కలెక్షన్లను రాబట్టినట్లు ఫిలింనగర్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 21న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.129 కోట్లను వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ తెల్పింది .మొట్ట మొదటి సారిగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్‌లో వచ్చిన ఈ మూవీలో అందాల బ్యూటీలు రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు.