తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు..కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాశారు . నీటి విడుదల విషయంలో బోర్డు సమర్థంగా పని చేయకపోగా పక్షపాత ధోరణి అవలంభిస్తోందని లేఖలో పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద వివరాలను తారుమారు చేస్తున్నట్లు లేఖలో తెలిపారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు టెలీమెట్రీ ఏర్పాటులో ఆలస్యం చేస్తుందని ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై బోర్డుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బోర్డు అనుకూలంగా వ్యవహరిస్తుందని తెలిపారు. ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని మంత్రి వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కేంద్రమంత్రిని హరీష్‌రావు కోరారు.
