తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన ఫారుఖ్ హుస్సేన్ కు సంబంధించిన అద్దె ఇల్లు విషయంలో రాజుకున్న వివాదంపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో తను అద్దెకు ఉంటున్న తన ఇంటికి ఒక మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని కోరారని, ఆమె ఇంటి యజమాని అనే విషయం తనకు తెలియదని ఆయన వివరణ ఇచ్చారు.
మహిళ తనను తిట్టడంతో ఇంట్లో నుంచి వెళ్లాలని చెప్పానన్నారు. తన రాజకీయ జీవితంలో అవినీతికి పాల్పడలేదని ఆయన స్పష్టంచేశారు. లక్డీకాపూల్‌లో కొన్నేళ్లుగా అద్దెకు ఉంటున్నానని, ఈ రోజు సోమవారం ఇద్దరు వ్యక్తులు ఇల్లు ఖాళీ చేయాలని తమ ఇంటికి వచ్చారని ఆయన వివరించారు. అయితే ప్రభుత్వం నిర్మిస్తున్న ఎమ్మెల్యేల క్వార్టర్స్ పూర్తయ్యాక వెళ్తానని వారితో చెప్పినట్టు ఆయన మీడియాకు తెలిపారు. ప్రణాళిక ప్రకారం తనను బదనాం చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు.