అవసరానికి వాడుకుని తీరా అవసరం తీరాకా విసిరిపారేసే చంద్రబాబు కరివేపాకు సిద్ధాంతానికి మరో ఏపీ మంత్రి బలి కాబోతున్నాడు..చంద్రబాబు తన కరివేపాకు సిద్దాంతంలో భాగంగా తన చుట్టూ ఉన్న తెలుగు తమ్ముళ్లలో ఎవరినైనా వదిలించుకోవాలంటే వెంటనే ఆయనకు స్వామిభక్తిని ప్రదర్శించే అను`కుల` పత్రికలు రంగంలోకి దిగుతాయి..మొన్నటి వరకు సచ్ఛీలుడిగా కనిపించిన సదరు వ్యక్తి అవినీతికి పాల్పడుతున్నట్లు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల్లో పార్టీ పరువు తీస్తున్నట్లు, చంద్రబాబుకు తలపోటుగా తయారయ్యాడని, సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదంటూ బురద జల్లుడు కథనాలు వెలువరిస్తాయి..లౌడ్ వాయిస్‌లో సదరు వ్యక్తిపై చెత్త పలుకులు పలికించి ఇక అతను వేస్ట్ అన్నట్లు కలరింగ్ ఇస్తాయి..ఎన్టీఆర్‌కు వెన్నుపోటుకు ముందు చంద్రబాబు ఆదేశాల మేరకు అను`కుల` పత్రికలు రంగంలోకి దిగి లక్ష్మీపార్వతి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తుందని , టీడీపీ ప్రభుత్వం పరువు పోతుందని, పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమెపై విషపూరిత కథనాలు ప్రచురించి చంద్రబాబు వెన్నుపోటుకు సహకరించిన సంగతి తెల్పిందే..ఇలా చంద్రబాబుకు నచ్చని వ్యక్తులను పార్టీ నుంచి తప్పించడానికి అను`కుల` పత్రికలు తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నాయి. అంతే కాదు పార్టీలో చంద్రబాబును మించి పేరు తెచ్చుకుంటున్నారని కొందరు నాయకుల రాజకీయ భవిష్యత్తును కనుమరుగు అయ్యేలా చేయడంలో ఈ పచ్చ పత్రికలు విజయవంతం అయ్యాయి..
తాజాగా టీడీపీ ప్రభుత్వంలోని కీలక మంత్రి, ఆర్థికంగా బలవంతుడైన కాపు సామాజికవర్గానికి చెందిన ఓ మంత్రిని ఎల్లో మీడియా టార్గెట్ చేసింది. గత ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి తగిన ఆర్థిక వనరులు సమకూర్చింది సదరు మంత్రిగారు. అందుకే ఆయన గత ఎన్నికల్లో ఓడిపోయినా..పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చి ఆ తర్వాత ఎమ్మెల్సీ చేశారు. కీలకమైన రాజధాని నిర్మాణ బాధ్యతలు సదరు మంత్రిగారికే అప్పగించారు. ఆ మంత్రిగారు కూడా తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడంలో ఎక్కడా తడబడలేదు..చాలా చాకచక్యంగా రైతులను ఒప్పించి రాజధానికి కావాల్సిన భూములను సేకరించారు. అంతే కాదు రాజధాని నిర్మాణంలో విదేశీ ఆర్కిటెక్ట్‌లను పిలిపించి డిజైన్లు రెడీ చేస్తున్నారు..మూడేళ్లుగాచంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారాడు. ఏపీ ప్రభుత్వంలో కీలక మంత్రిగా చక్రం తిప్పుతున్నారు. ఒక దశలో చంద్రబాబు కూడా సదరు మంత్రిగారికి పూర్తిగా సరెండర్ అయ్యారనే టాక్ టీడీపీ వర్గాల్లో వినిపించింది. అయితే బాబుగారి పుత్రరత్నం లోకేష్ బాబు మంత్రి వర్గంలోకి వచ్చిన తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. రాజధాని నిర్మాణం, భూముల విషయంలో సదరు మంత్రిగారికి , లోకేష్‌కు మధ‌్య బేధాభిప్రాయాలు నెలకొన్నట్లు సమాచారం. అందుకే సదరు మంత్రిగారిని సీఆర్డీఏ పరిధి నుంచి తప్పించబోతున్నట్లు అనుకుల మీడియాకు ముందుగా లీకు అందించారు..రాజధాని భూముల విషయంలో లోకేష్ జోక్యంతో సదరు కాపు మంత్రి అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వచ్చాయి..అయితే సదరు మంత్రిగారు లోకేష్‌ను లెక్కచేయకపోవడం, తనదైన స్టైల్లో ముందుకు దూసుకుపోవడం బాబుగారి అను`కుల` ప్రతికలకు నచ్చలేదు..అందుకే ఆయనపై బురద జల్లుడు కార్యక్రమాన్ని ప్రారంభించాయి..ఆ మంత్రి మోనార్క్ పేరుతో చంద్రుడికి వెలుగు ఇచ్చే ఓ పత్రిక మొయిన్ పేజీలో బ్యానర్ ఐటమ్ పెట్టి విషం చిమ్మింది. సదరు మంత్రిగారి అజమాయిషీ ఎక్కువపోయిందని , రాజధాని నిర్మాణంలో తాను ఏం చేయాలనుకుంటే అదే చేస్తాడని..ఆఖరికి చంద్రబాబు చెప్పినా వినడం లేదని..నా మాటే నెగ్గాలనే తత్వం గa సదరు మంత్రిగారి వ్యవహారశైలి నచ్చక ఈ మూడేళ్లలో ముగ్గురు ఐఏఎస్ స్థాయి అధికారులు విధుల నుంచి తప్పుకున్నారని..అయినా సదరు మంత్రిగారిలో మార్పు రాలేదని..రాజధాని నిర్మాణంలో డిజైన్లు ఇచ్చిన మాకీ సంస్థ వెనక్కిపోవడానికి సదరు మంత్రిగారే కారణమని ఆ పచ్చ పత్రిక అభాండాలు వేసింది.
మంత్రి గారి నిజాయితీ, చిత్తశుద్ధిలో అనుమానం లేదని….కానీ దూకుడుగా వ్యవహరిస్తూ మొండి వైఖరితో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహిస్తున్నాడని, ఎప్పుడుబడితే అప్పుడు రాత్రనకా, పగలనకా సమీక్షా సమావేశాలు పెడుతూ అధికారులను ఇబ్బందిపెడుతున్నాడని ఆ పత్రిక మంత్రిగారిపై విషం చిమ్మింది. అంతేకాదు ఆఖరికి చంద్రబాబుపై వత్తిడి చేసి తనకు కావల్సిన పనులు చేయించుకుంటాడని, మంత్రిగారి అజమాయిషీ భరించలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారని, రాజధాని నిర్మాణం ఆలస్యం కావడానికి, డిజైన్లు ఇంకా ఖరారు కాకపోవడాని సదరు మంత్రిగారే కారణంమంటూ పచ్చ కథనాలు పచ్చిగా వండి వార్చింది. త్వరలో సీఆర్డీఏ పరిధి నుంచి సదరు మంత్రిగారిని తొలగించడం ఖాయమని రాసుకువచ్చింది ఆ పచ్చ పత్రిక. అంతే కాదు మూడేళ్లయినా రాజధాని నిర్మాణం ముందుకు పడకపోవడానికి కారణం సదరు మంత్రిగారి తీరే అని నొక్కి వక్కాణించింది. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు వైఫల్యాన్ని సదరు కాపుమంత్రిపై తోసేసి ఆయన్ని బలిపశువును చేయడానికే ఆ పచ్చ పత్రిక ఈ కథనం ప్రచురించిందని తెలుస్తోంది. ఈ కథనాన్ని చూస్తే సీఆర్డీఏ నిర్వహణబాధ్యతలనుంచి సదరు మంత్రిగారిని తొలగించి పూర్తిగా లోకేష్‌కే అప్పగించడానికి చంద్రబాబు స్కెచ్ వేశాడని..ఆ స్కెచ్‌లో భాగంగానే అను`కుల` పత్రికలో మంత్రికి వ్యతిరేకంగా బ్యానర్ ఐటమ్ ప్రచురించిందని టీడీపీలో చర్చ జరుగుతోంది. ఇంతకీ రాజధాని వ్యవహరాలు చూసే ఆ సదరు కాపు మంత్రి ఎవరో మీకు ఇప్పటికైనా అర్థమయ్యే ఉంటుంది..అదన్న మాట బాబుగారి కరివేపాకు థియరీకి మసాలా యాడ్ చేసే అను`కుల` పత్రిక కథా కమీషు..చంద్రుడికి వెలుగునిచ్చే ఆ ప్రతిక బ్యానర్ ఐటెం పడిందింటే ఇక సదరు మంత్రిగారి పదవి ఊస్టింగ్ అవడం ఖాయం..ఎనీ డౌట్…