ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడు ఆయన .నాడు టీడీపీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ,దివంగత మాజీ ముఖ్యమంత్రి ,ప్రముఖ విశ్వ విఖ్యాత నటుడు అయిన ఎన్టీఆర్ మీద హైదరాబాద్ మహానగరంలో లోయర్ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న అప్పటి వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులు విసిరాడు అనే ఆరోపణలు ఉన్న తెలంగాణ ప్రాంత సీనియర్ మాజీ మంత్రి ,గవర్నర్ గిరి మీద ఆశలు పెట్టుకున్న మోత్కుపల్లి నరసింహులు త్వరలోనే టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు అని వార్తలు వస్తోన్నాయి .
గత మూడున్నర ఏండ్లుగా పార్టీని అంటిపెట్టుకొని ఉండటమే కాకుండా గతంలో ఉమ్మడి ఏపీలో పదేండ్ల పాటు అధికారంలో లేకపోయిన కానీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన కానీ బాబు తన కృషిని గుర్తించడంలేదు అని తెగ ఫీల్ అవుతున్నాడు అంట మోత్కుపల్లి .ఇటీవల దసరా పండగ నాడు జరిగిన గవర్నర్ల నియామకం లో కూడా తనకు అవకాశం రాకపోవడం ..ఉన్న ఆశ కూడా ఇప్పట్లో నెరవేరదు అని గ్రహించిన ఈ సీనియర్ నాయకుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తోన్నాయి .
అయితే మరో పదేండ్లు కాదు కదా ఇరవై ఏండ్లు వేచి చూసిన టీడీపీ పార్టీ బ్రతికి బట్ట కట్టే పరిస్థితి లేకపోవడం ..తన రాజకీయ జీవితం చివరి దశలో ఉండటం ..అప్పటివరకు తనకు వేచి చూసే ఓపిక లేకపోవడం కూడా పార్టీ మారడానికి ఆయన సిద్ధమైనట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి .అయిన రాజకీయంలో మోస్ట్ సీనియర్ అయిన ఈ సీనియర్ మాజీ మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటాడో కాలమే చెప్పాలి ..