Home / SLIDER / చంద్రబాబును అవమానించిన రేవంత్‌‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి జంప్ అవడం ఖాయమేనా..!

చంద్రబాబును అవమానించిన రేవంత్‌‌రెడ్డి.. కాంగ్రెస్‌లోకి జంప్ అవడం ఖాయమేనా..!

తెలంగాణ టీడీపీ నాయకుడు రేవంత్‌ రెడ్డి త్వరలో పార్టీకి గుడ్‌బై చెప్పడం ఖాయమేనా…చంద్రబాబును సైతం ధిక్కరించబోతున్నాడా…త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నాడా…ప్రస్తుతం జరుగుతున్నపరిణామాలను చూస్తుంటే నిజమే అనిపిస్తుంది..గత కొంత కాలంగా టీడీపీ అధినాయకత్వం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. పరిటాల శ్రీరామ్ పెండ్లిలో టీడీపీ నాయకులు కేసీఆర్‌కు అపూర్వ స్వాగతం పలికారు. మెజార్టీ టీడీపీ నేతలు కేసీఆర్‌ను ఓన్ చేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా కేసీఆర్‌తో పోరాటానికి టీటీడీపీ నేత రేవంత్ రెడ్డికి ఏ మాత్రం సహకరించడం లేదు..అటు లోకేష్‌ కూడా రేవంత్‌కు అందుబాటులో లేదు..తెలంగాణలో దాదాపుగా పతనమైన టీడీపీని తిరిగి అధికారం దిశగా తీసుకువెళ్లేందుకు రేవంత్ రెడ్డి నానా తిప్పలు పడుతున్నాడు.. అయితే తెలంగాణ టీడీపీ నాయకులు కూడా కేసీఆర్‌‌పై పోరాటానికి ఇష్టపడడం లేదు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అలాంటిది రేవంత్‌ రెడ్డి ఒంటెద్దు పోకడతో వ్యవహిరిస్తున్నాడని, కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడని మోత్కుపల్లిలాంటి సీనియర్ నాయకులు మండిపడుతున్నారు..డైరెక్ట్‌గా మేము కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోము కావాలంటే టీఆర్ఎస్, బిజేపీలతో పోత్తు పెట్టుకుంటామని అధిష్టానం అభిప్రాయం కూడా ఇదే అన్నట్టుగా కుండబద్ధలు కొట్టారు. తమ పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు రేవంత్‌ రెడ్డికి మింగుడుపడడం లేదు..మొన్న కేసీఆర్ ప్రెస్‌మీట్లో ప్రతిపక్షాలపై చేసిన విమర్శలకు కౌంటర్‌గా టీడీపీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టాడు. ప్రతిపక్షాల అనైక్యతే కేసీఆర్‌కు ప్లస్‌ అవుతుందని..కేసీఆర్‌ను ఓడించాలంటే ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపు ఇచ్చాడు..తెలంగాణ తెచ్చింది నేనే కాదా అన్న కేసీఆర్ ప్రశ్నకు సమాధానంగారేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆకాశానికి ఎత్తేశాడు. సోనియాగాంధీ దయతలిస్తే తెలంగాణ వచ్చింది అని, కేసీఆర్ ఆమె కాళ్లు మొక్కిద్రోహం చేశారని..సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలంటే తెగపొగిడేశాడు.అంతే కాదు టీఆర్ఎస్‌తో కలిస్తే తమ ఇంటివాళ్లే తమను ఇంటికి రానివ్వరని మోత్కుపల్లికి కౌంటర్ ఇచ్చారు.

అసలు తెలంగాణ వచ్చింది నావల్లే..నేను రెండు సార్లు లేఖ ఇచ్చి వత్తిడి పెంచడం వల్లే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనకు ముందుకు వచ్చిందని చంద్రబాబు తెలంగాణ వచ్చినప్పుడల్లా చెబుతుంటాడు..ఇప్పుడు స్వయంగా తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి తమ సొంత పార్టీ కార్యాలయంలో కూర్చుని సోనియాగాంధీని దేవతలా కీర్తించడం టీడీపీ అధిష్టానానికి మింగుడుపడడం లేదు..కాంగ్రెస్‌తో పొత్తుకు టీడీపీ ఏ నాడు వెంప్లరాడదు. ఇప్పటికీ రాష్ట్ర విభజనకు కారణం కాంగ్రెస్సే అని చంద్రబాబు ఏపీలో సమయం, సందర్భంగా లేకుండా
విరుచుకుపడుతుంటాడు. .అలాంటి తమ పార్టీనేత సోనియాగాంధీని పొగిడేయడం చంద్రబాబు బ్యాచ్‌ జీర్ణించుకోలేకపోతుంది. రేవంత్‌ కాంగ్రెస్‌లోకి పోవడం ఖాయమని తెలంగాణ టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే ముందస్తుగా సోనియాగాంధీని పొగుడుతున్నాడని..టీడీపీ నాయకులు అనుమానం వ్యక్తం తెలంగాణ ఇచ్చిన క్రెడిట్‌ సోనియాగాంధీకి కట్టబెట్టి..తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న చంద్రబాబును పరోక్షంగా అవమానించాడని రేవంత్‌పై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.. మొత్తానికి టీటీడీపీకి శల్యసారథ్యం వహిస్తున్న రేవంత్‌ రెడ్డి ఆఖరికి కాడి పడేసి తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది..మరి రేవంత్ టీడీపీలోనే ఉంటాడా..కాంగ్రెస్‌లో చేరుతాడో లేదో చూడాలి..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat