ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం.. అద్భుతమైన రాజధాని కట్టిస్తాం..పోలవరం పూర్తి చేయిస్తాం..అత్యుత్తమ విద్యా , వైద్య సంస్థలు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం..విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటాం అని 2014 ఎన్నికలకు ముందు తిరుమల వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు మోదీ..తీరా అధికారంలోకి వచ్చాక ఏపీ ప్రజల ముఖాన పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లు కొట్టాడు..ఏపీ సీఎం చంద్రబాబు ఓటుకు నోటుకు కేసులో దొరికిపోవడంతో మోదీకి బాబు జుట్టుపట్టుకుని ఆడిస్తున్నాడు..ఏపీకి ఇస్తామన్న ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించాడు. పోలవరం నిర్మాణంపై నిధులు కేటాయింపులో ముష్టి విదిలిస్తున్నాడు.. తాజాగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్న మాట ప్రకారం ఏపికి కేటాయించిన ప్రాజెక్టునులను కూడా గుజరాత్‌కు తరలించుకుపోతున్నాడు. తాజాగా మోదీ మరోసారి ఏపిని చావుదెబ్బకొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. విభజన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన ప్రాజెక్టును మోదీ తన స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలించుకుపోయినట్లు తెలుస్తుంది. తీరప్రాంతాల్లో ఉండే మెరైన్ సిబ్బంది శిక్షణ కోసం మచిలీపట్నం అనువుగా ఉంటుందని అక్కడ అకాడమీ ఏర్పాటుకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రపభుత్వం కూడా 300 ఎకరాలు కేటాయించింది. ఈ ప్రాంతం ట్రైనింగ్ కు అనుగుణంగా ఉందని మెరైన్ ఐజీ శ్రీనివాసరెడ్డి కూడా స్థలాన్ని పరిశీలించి మెరైన్ అకాడమి ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. అయితే ఈ ప్రాజెక్ట్ కోసం తమిళనాడు, గుజరాత్ లు పోటీ పడగా సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి ఆ మెరైన్ ప్రాజెక్ట్ ఏపీకి వచ్చేలా పావులు కదిపారు. కానీ మోదీ వల్ల ఏపీకి రావాల్సిన ప్రాజెక్టు కాస్తా గుజరాత్‌కు తరలిపోయిందని విశ్వసనీయ సమాచారం. గుజరాత్ ఎన్నికల్లో గెలుపుకోసం అస్త్రాలన్నీ సిద్ధం చేసుకుంటున్నమోదీ మెరైన్ ప్రాజెక్ట్ ను ఏపీ నుంచి తీసుకొని గుజరాత్ కు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఏపీకి దక్కిన ప్రాజెక్టును ఇలా గుజరాత్‌కు తరలించుకుపోయిన మోదీ తీరుపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.. ఏపీకి మోదీ మరోసారి అన్యాయం చేశారని ఏపీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.