హైదరాబాద్ మహా నగరం లో భారీ వర్షం మరోసారి ముంచెత్తింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షానికి వాహనదారులు అష్టకష్టాలు పడుతున్నారు. చాదర్‌ఘాట్, మలక్‌పేట్, కోఠి, చార్మినార్, చాంద్రాయణ గుట్ట, బహదూర్ పుర, రాజేంద్ర నగర్, శంషాబాద్, అత్తాపూర్, గండిపేట, శివరాంపల్లి, జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్‌లలో భారీ వర్షం పడుతోంది. ఆబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బేగం బజార్, సుల్తాన్ బజార్ తో పాటు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడుతోంది. పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సిటీలో నాలాలు మళ్లీ పొంగుతున్నాయి.