రేపటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు.మొదటి పర్యటనను సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గం నుంచి ప్రారంబించాలని అనుకున్నారు . ఈ నేపధ్యంలో రాష్ట్ర౦లో భారీ వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో రేపు సీఎం కేసీఆర్ పర్యటన వాయిదా పడింది. తిరిగి ఈ నెల 13న నారాయణఖేడ్ లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
