ప్రముఖ గాయకుడు అద్నాన్ సమి జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై మండిపడ్డారు. ‘నువ్వో శాడిస్ట్‌వి’ అంటూ ట్విటర్లో నోటికొచ్చినట్టు తిట్టిపోశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. శనివారం అద్నాన్ శ్రీనగర్‌లోని దాల్ లేక్ సమీపంలో కచేరీ నిర్వహించారు.
అయితే ఈ కార్యక్రమానికి ఎవ్వరూ రాకపోవడంతో సీట్లు ఖాళీగా మిగిలిపోయాయని ఓ నెటిజన్ ట్విటర్లో ఫొటోలు పోస్ట్ చేస్తూ.. ‘అద్నాన్ సమి కచేరీ కార్యక్రమంలో ఖాళీ సీట్లు. మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం ఉన్న జమ్మూకశ్మీర్‌కు ఇది అవమానకరం.’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌ని ఒమర్ అబ్దుల్లా రీట్వీట్ చేస్తూ.. ‘ఇది నిజంగానే బాధాకరం. ఆ సీట్లు ఖాళీగా ఉంచకుండా ఉండాల్సింది. ఆ సాయంత్రం అద్నాన్ సంగీత కచేరీతో ప్రజలకు మరింత ప్రశాంతత లభించేది.’ అని ట్వీట్ చేశారు. ఒమర్ ట్వీట్‌కి అద్నాన్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఇద్దరూ పరస్పరం తిట్టుకుంటూ ట్వీట్లు విసురుకున్నారు.