హైదరాబాద్‌లోని రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో శిక్షణలో ఉన్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. వసతిగృహంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని నవీన అనే ట్రైనీ కానిస్టేబుల్ బలవన్మరణం చెందింది. నల్గొండకు చెందిన నవీన, వేములపల్లికి చెందిన మరో ట్రెయినీ కానిస్టేబుల్ మాధవి మంచి స్నేహితులు. అయితే తనకు ఇష్టంలేని పెళ్లి కుదిర్చారని కలతచెందిన మాధవి శనివారం తన స్వగ్రామంలో ఆత్మహత్యకు చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన నవీన పోలీస్ అకాడమీలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
దీనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ మాధవి నల్గొండ జిల్లా వేములపల్లిలో శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమ విఫలమే కారణమని డైరీలో రాసి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.