ఉదయం అల్పాహారమైనా, మధ్యాహ్నం లంచ్ లేదా రాత్రి డిన్నర్ అయినా భోజనం చేశాక కొంత సేపటికి అధిక శాతం మందికి గ్యాస్ సమస్య వస్తుంటుంది. తిన్నది సరిగ్గా అరగకపోవడమో, ఎక్కువగా తినడమో, ఇతర జీర్ణ సంబంధ సమస్యల వల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అదే ఆహారం సరిగ్గా జీర్ణమైతే అలా గ్యాస్ రాదు. ఈ క్రమంలో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమై తరువాత గ్యాస్ రాకుండా ఉండాలంటే పలు పండ్లను తింటే చాలు. దీంతో ఇతర జీర్ణ సంబంధ సమస్యలు కూడా పోతాయి.
యాపిల్
భోజనం చేశాక 15 నిమిషాల తరువాత ఈ పండును తినవచ్చు. దీంట్లో ఉండే ఔషధ గుణాల వల్ల మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీలు రావు. సన్నగా ముక్కల్లా కట్ చేసి యాపిల్‌ను తింటే ఇంకా మంచిది.
అరటిపండు
భోజనం చేశాక అరటి పండును తింటే ఎంతో మంచిది. దీని వల్ల మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్ రాదు.
బొప్పాయి
బొప్పాయిలో మనకు ఆరోగ్యాన్ని కలిగించే ఔషధ కారకాలు ఎన్నో ఉన్నాయి. వీటి వల్ల అజీర్తి సమస్య తొలగిపోతుంది. భోజనం చేసిన తరువాత బొప్పాయి పండ్లను తింటే మన జీర్ణవ్యవస్థ శుభ్ర పడుతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
పైనాపిల్
పైనాపిల్‌లో బ్రొమెలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణాశయ పనితీరును మెరుగు పరుస్తుంది. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ వంటి సమస్యలు ఉన్న వారు భోజనం చేశాక ఈ పండును తింటే ఫలితం ఉంటుంది.
అంజీర్
అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ లభిస్తాయి. వీటిని తింటే జీర్ణ వ్యవస్థ శుభ్ర పడుతుంది. వ్యర్థాలు బయటికి పోతాయి. అంతే కాదు అంజీర్ పండ్ల వల్ల మనకు తక్షణమే శక్తి లభిస్తుంది.