ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ క్రమంలో రాష్ట్రంలో మరో ఏడాదిన్నర సమయంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసేవారిలో డెబ్బై మంది కొత్త వారు ఉండాలని నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడుతున్నారు అని ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది .
ఆ పత్రిక కథనం ప్రకారం వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పార్టీకి కొత్త రక్తం ఎక్కించాలని బాబు చూస్తున్నాడు .దీంతో రాష్ట్రంలో మొత్తం 175 స్థానాలకు గాను 70 మంది కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలని ఆ పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుగు తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు అని ఆ పత్రిక కథనంలో పేర్కొంది.అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో జరిగిన తన సమీక్షలో పార్టీ ఎమ్యేలు పలువురి పనితీరు బాగోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు.
గత కొంత కాలంగా నిర్వహిస్తోన్న ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో వీరు చురుకుగా పాల్గొనడం లేదని ఆయన అన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో దీనికి సంబంధించి సుమారు ఇరవై మంది ఎమ్మెల్యేలకు సి,డి గ్రేడ్ లు ఇచ్చారు ఈ గ్రేడ్ లు ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.కొత్తవారికి టిక్కెట్లకు ఇవ్వడానికే రంగం సిద్దం చేయడంలో భాగంగా ఇలా చేస్తున్నారన్నది వారు తెగ ఆందోళన చెందుతున్నారు .