పైనాపిల్ మిల్క్‌షేక్ ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం ..
కావల్సినవి: తాజా అనాస పండు రసం – రెండు కప్పులు, దాల్చినచెక్క పొడి – అర చెంచా, తేనె – రెండు టేబుల్‌స్పూన్లు, చల్లటి పాలు – అరకప్పు, చల్లటి పెరుగు – కప్పు.
తయారీ: ముందుగా తేనె, పాలు, పెరుగు మిక్సీలోకి తీసుకుని మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీనికి అనాసపండు రసం, దాల్చినచెక్క పొడి కలిపి గ్లాసుల్లోకి తీసుకుంటే చాలు.