ప్రగతిభవన్‌లో సింగరేణి కార్మికులతో సీఎం కేసీఆర్ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సింగరేణిలో పరిస్థితులు చక్కదిద్దాలని..త్వరలో సింగరేణి యాత్ర చేపడతానని సీఎం కేసీఆర్ అన్నారు.అంబేద్కర్ జయంతి రోజు సింగరేణికి సెలవుదినం. ఐఐటీ, ఐఐఎంలలో సింగరేణి కార్మికుల పిల్లలకు సీట్లు దొరికితే ఆ ఫీజంతా కంపెనీయే భరిస్తుందని సీఎం హామీనిచ్చారు. . ఆస్పత్రుల విషయంలో మీకు పూర్తి న్యాయం జరిగేటట్లు చూస్తమని సీఎం పేర్కొన్నారు. ఆరు భూగర్భగనులు ప్రారంభమైతే..ఆరేడు వేల మందికి ఉద్యోగాలు దొరుకుతయి. క్వార్టర్లకు ఏసీ పెట్టుకునే అవకాశం కల్పిస్తం. దానికి ప్రీ కరెంట్ ఇస్తం. క్యాంటీన్లలో ఏఏ పదార్థాలుంటే బాగుంటాయో లిస్ట్ తయారుచేసుకోవాలి. గోదావరిఖని అయినా ఎక్కడైనా నేనే వస్తా మీ సమ్యలు ఏంటో తెలుసుకుంటా. మీరు చూపించుకుంటున్న ఆస్పత్రిలోనే బీపీ చెక్ చేయించుకుంటానని సీఎం తెలిపారు
