తెలంగాణ రాష్టంలో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా రెండు వేర్వేరు శాఖల్లో 257 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ శనివారం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనుమతి ఇచ్చిన వాటిలో జైళ్లశాఖలో 238, అటవీశాఖలో 19 పోస్టులు ఉన్నాయి. జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్లు-15, అసిస్టెంట్ మ్యాట్రన్ -2, వార్డర్ (పురుష)-186, వార్డర్ (మహిళ)- 35 ఖాళీలు ఉన్నాయి. అటవీశాఖలో 19 అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పోస్టులు ఉన్నాయి. కొలువుల భర్తీకి సంబంధించిన వివరాలను సంబంధిత శాఖలకు అందించాలని ఆర్థికశాఖ సూచించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా కొలువుల భర్తీ అవుతాయని, వివరాలు అందించాలని ఆయా శాఖలకు సూచించింది.
