ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ చదరంగంలో ఎవర్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడుకోవాలో తెల్సినంతగా ఎవరికీ తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో .అంతగా ఆయన తన రాజకీయం కోసం ఎంతగా అయిన తెగిస్తాడు .ఇది ప్రతిపక్షాలు చేసే ప్రధాన ఆరోపణ .గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తో సహా పలువురు ఎమ్మెల్యేలను తమ పార్టీ వైపు ఆకర్శించుకోవడానికి మంత్రి పదవులు ఆశచూపించి మరి చేర్చుకున్నాడు .తీరా మంత్రి పదవి ఆశ తీరకుండానే ఆయన దూరమయ్యారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి .
అయితే తాజాగా తన రాజకీయ చదరంగంలో దివంగత ఎమ్మెల్యే భూమా తనయురాలు అయిన మంత్రి భూమా అఖిల ప్రియ ,తన అన్న కుమారుడు అయిన ప్రస్తుత నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిలకి తన రాజకీయ చాతుర్యత ఏమిటో రుచి చూపించబోతున్నాడు .ప్రస్తుతం అధికార పార్టీ అయిన టీడీపీ నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి బాబు ర్యాంకింగ్ సిస్టం ఇస్తోన్న సంగతి తెల్సిందే .ఈ క్రమంలో కేటాయించే ర్యాంకింగ్ సిస్టం నుండి మంత్రి అఖిల ప్రియ ,ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న ఆళ్లగడ్డ ,నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గాలను తప్పించాడు బాబు .
జిల్లాలో ఎమ్మెల్యేలు అయిన ఎస్వీ మోహన్ రెడ్డి ,వై సాయిప్రసాద్ రెడ్డి ,బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి లు ప్రాతినిధ్యం వహిస్తోన్న కర్నూలు ,ఆదోని ,డోన్ నియోజక వర్గాలు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కి కంచు కోట అయితే ఇక్కడ మాత్రం టీడీపీ కార్యక్రమం ఘనవిజయం సాధించింది అని ఏ గ్రేడ్ లు ఇచ్చాడు బాబు .కానీ స్వయానా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజక వర్గంలో ఈ కార్యక్రమం విజయవంతం కాలేదు అని అందుకే నంద్యాల తో పాటుగా ఆళ్లగడ్డకు డీ ,సీ గ్రేడ్ లిచ్చాడు .అంతే కాదు ఏకంగా ఈ ఇద్దరికీ బాబు క్లాస్ పీకాడు .అయితే వచ్చే ఎన్నికల్లో వీళ్ళు గెలిచే అవకాశాలు లేకపోవడం ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలలో ఒక్కటి కూడా నేరవేర్చకపోవడం ..ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అతిగతి లేకపోవడంతో బాబు వీరిద్దరికీ సీటు ఇవ్వకూడదు అని ఇలా వ్యవహరిస్తున్నాడు అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి .సో పట్టు మని పదేండ్ల అనుభవం లేని వీళ్ళకు ముప్పై యేండ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్న బాబు తన సీనియారిటీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాడు కదా ..